: చెన్నై-గూడూరు మధ్య పలు రైళ్లు రద్దు!
భారీ వర్షాల కారణంగా చెన్నై-గూడూరు మధ్య తిరగాల్సిన ఆరు రైళ్లను ఈ రోజు రద్దు చేశారు. ఈ విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. రద్దయిన రైళ్ల వివరాలు ... డెహ్రాడూన్-చెన్నై సెంట్రల్ ఎక్స్ ప్రెస్, విశాఖ-చెన్నై సెంట్రల్ ఎక్స్ ప్రెస్, ధన్ బాద్-అలెప్పీ, పాట్నా-ఎర్నాకుళం, గువాహటి-త్రివేండ్రం, దిబ్రూగఢ్-కన్యాకుమారి ఎక్స్ ప్రెస్ లు రద్దయ్యాయి. కాగా, రైల్వేట్రాక్ లపై వరద నీరు చేరిన కారణంగా మరో 5 రైళ్లను దారి మళ్లించారు. చెన్నైతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కూడా ఎడతెరిపి లేని వర్షాల కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. రహదారులు, రైల్వే ట్రాక్ లు పూర్తిగా దెబ్బతిన్నాయి.