: దమ్ముంటే స్వామీజీలు పెళ్లి చేసుకుని ఒకరిని కనాలి: ఒవైసీ
దేశాన్ని హిందూ రాజ్యంగా మార్చేందుకు కుట్ర జరుగుతోందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ఈ కుట్రలో భాగంగానే, భారత్ లో ముస్లిం జనాభా విపరీతంగా పెరిగిపోతోందంటూ ఆర్ఎస్ఎస్, హిందూ వాహిని సంస్థలు ఆరోపిస్తున్నాయని విమర్శించారు. హిందూ స్వామీజీలకు దమ్ముంటే పెళ్లిచేసుకోవాలని... ఒకరినైనా పుట్టించి చూపాలని సవాల్ విసిరారు. ప్రజలను రక్షించడం కన్నా గోవులను రక్షించడానికే ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ఎవరు ఏం తినాలో నిర్ణయించే అధికారం కేంద్రానికి లేదని చెప్పారు.