: అస్వస్థత పాలైన బాలీవుడ్ నటుడు మనోజ్ కుమార్
బాలీవుడ్ ప్రముఖ నటుడు, దర్శకుడు మనోజ్ కుమార్ (78) అస్వస్థతకు గురయ్యారు. గత పది రోజుల నుంచి ఆయన ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దాంతో ప్రస్తుతం మనోజ్ బాగానే ఉన్నారని కుటుంబ సన్నిహితులు తెలిపారు. డిశ్చార్జ్ అయి ఇంటికి కూడా వచ్చారని చెప్పారు. మనోజ్ తరచూ వెన్ను నొప్పితో బాధపడుతున్నట్టు తెలిసింది. సినీ పరిశ్రమలో భరత్ కుమార్ గా పిలవబడే మనోజ్ కుమార్ దాదాపు 55 సినిమాల్లో నటించారు. 7 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన నటించిన చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించారు.