: మూతపడ్డ కాలేజీలే కమిషనరేట్లు, గోడౌన్లే కార్యాలయాలు... హతవిధీ అంటున్న ఏపీ ఉద్యోగులు!


హైదరాబాద్ లో కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాఖల తరలింపు తథ్యమని చెబుతున్న ప్రభుత్వం, వివిధ విభాగాల అధిపతులతో వేర్వేరుగా చర్చలు జరుపుతూ, విజయవాడ పరిసరాల్లోని గోడౌన్లు, మూతపడ్డ కాలేజీలను చూసి ఒకటి ఎంచుకోవాలని స్పష్టం చేస్తోంది. ఇప్పటికే రాజధాని తరలింపు కమిటీ వివిధ ప్రాంతాల్లో నిరుపయోగంగా ఉన్న గోడౌన్లు, భవనాల జాబితా తయారు చేసి, ఆ వివరాలను వివిధ శాఖలకు అందించింది. అక్కడికి వెళ్లి చూసుకుని, ఓ కార్యాలయాన్ని ఎంపిక చేసుకుని ఎంత ఖర్చయినా, ఇంటీరియర్ పనులను వేగంగా పూర్తి చేసుకుని, అక్కడి నుంచే ఆఫీసులు నడపాలని ఆదేశిస్తోంది. గొల్లపల్లి ప్రాంతంలోని మూత పడ్డ కళాశాలల్లోకి పలు కమిషనరేట్లను, గొల్లపూడి ప్రాంతంలో కమిటీ సూచించిన గోడౌన్లలోని వ్యవసాయం తదితర శాఖలు, వాటి అనుబంధ శాఖల కార్యాలయాలు తరలించాలన్నది కమిటీ సూచన. ఇక కాస్తంత లగ్జరీగా కనిపించే వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్లు వంటి శాఖల భవనాలను మాత్రం స్వయంగా వారే చూసుకోవాలని కమిటీ చెప్పినట్టు తెలుస్తోంది. ఇక గోడౌన్ల నుంచి పనిచేయక తప్పదని భావిస్తున్న ఉద్యోగసంఘాలు 'హతవిధీ' అంటున్నాయి.

  • Loading...

More Telugu News