: 'మా టీవీ' ఇక మన టీవీ కాదు... స్టార్ టీవీయే!


తెలుగు లోగిళ్లలో వినోదాల పంట పండిస్తున్న 'మా టీవీ', స్టార్ టీవీ చానళ్లను అందిస్తున్న స్టార్ ఇండియాలో పూర్తిగా విలీనమైంది. ఈ విషయాన్ని రూపర్ట్ మర్డోక్ నేతృత్వంలోని ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఫాక్స్ అధీనంలోని స్టార్ ఇండియా స్వయంగా ప్రకటించింది. గతంలోనే మా టీవీ, మా గోల్డ్, మా మ్యూజిక్, మా సినిమా టీవీ చానళ్లను కొనుగోలు చేస్తున్నట్టు స్టార్ గ్రూప్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ డీల్ విలువ ఎంతన్నది అధికారికంగా వెల్లడికాకపోయినా, రూ. 2,500 కోట్ల వరకూ ఉండవచ్చని అంచనా. విలీనం అధికారికంగా పూర్తయిందని ప్రకటించిన స్టార్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉదయ్ శంకర్, త్వరలో మరిన్ని కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తామని తెలిపారు. మా టీవీలో నిమ్మగడ్డ ప్రసాద్ తో పాటు, నాగార్జున, చిరంజీవి ఫ్యామిలీలకు వాటాలు ఉన్న సంగతి తెలిసిందే. అచ్చ తెలుగు సినీ కుటుంబాల వాటా ఉన్న మా టీవీ చానళ్లు స్టార్ లో కలసిపోవడంతో ఇకపై కార్యక్రమాలు, సీరియళ్లు ఏ దిశగా మలుపులు తిరుగుతాయన్నది వేచి చూడాలి.

  • Loading...

More Telugu News