: ముస్లింలపై మోదీ యుద్ధ సన్నాహాలు చేస్తున్నారు!... మేనిఫెస్టోలో ఐఎస్
మెరుపు దాడులు, భయంకర శిక్షలతో ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు భారత ప్రధాని నరేంద్ర మోదీపై వాగ్బాణాలు సందిస్తూనే ఉన్నారు. ‘బ్లాక్ ఫ్లాగ్స్’ పేరిట ఇటీవల విడుదలైన ఆ సంస్థ మేనిఫెస్టోలో ఉగ్రవాదులు మోదీ పేరును ప్రముఖంగా ప్రస్తావించారు. భారత్ లోని రాజకీయ స్థితిగతులపైనా కాస్తంత లోతుగానే విశ్లేషించారు. హిందూ జాతీయ వాదిగా మారిన మోదీ దేశంలోని ముస్లింలను తన మొదటి శత్రువుగా పరిగణిస్తున్నారని ఐఎస్ ముష్కరులు ఆరోపించారు. యుద్ధ పూజ చేస్తున్న మోదీ, హిందువులను ముస్లింలపైకి ఉసిగొల్పుతున్నారని ధ్వజమెత్తారు. ఐఎస్ ఉగ్రవాదుల మేనిఫెస్టోను ప్రచురించిన ‘ద ఇండియన్ ఎక్స్ ప్రెస్’ కథనంపై ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.