: అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం పూర్తి... సీఆర్డీఏకు 12,500 ఎకరాలు అప్పగింత


నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణంలో నిన్న మరో కీలక ఘట్టాన్ని చంద్రబాబు సర్కారు ముగించింది. ఇప్పటిదాకా రైతుల నుంచి భూమిని సేకరించిన ప్రభుత్వం, ఆ భూములను రాజధాని నిర్మాణ బాధ్యతలు చేపట్టనున్న సీఆర్డీఏకు అప్పగించలేదు. అంతేకాక సీఆర్డీఏకు పూర్తి స్థాయి నిర్మాణ బాధ్యతలు దఖలు పరచలేదు. దాదాపు ముందుగా నిర్దేశించుకున్న మేరకు భూములను ప్రభుత్వం రైతుల నుంచి సేకరించింది. నిన్న సాయంత్రం ఈ భూముల్లోని 12,500 ఎకరాలను సీఆర్డీఏకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు తదుపరి చర్యలు తీసుకోవాలంటూ సీసీఎల్ఏ, గుంటూరు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ భూముల బదలాయింపు ద్వారా సీఆర్డీఏ కూడా ఇకపై పూర్తి బాధ్యతలు చేపట్టనుంది. భూమి అప్పగింతకు సంబంధించి ఉత్తర్వులు వెలువడిన మరుక్షణమే సీఆర్డీఏ అధికారులు మలిదశ పనులకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం అందజేసిన భూముల్లో చేపట్టనున్న నిర్మాణాలకు సంబంధించిన సమగ్ర ప్రణాళికలను ఈ నెల 15లోగా రచిస్తామని వారు ప్రకటించారు.

  • Loading...

More Telugu News