: 'బాహుబలి' సాయం 15 లక్షలు
చెన్నై వరద బాధితులకు టాలీవుడ్ నటీనటులు 'మేమున్నామంటూ' భరోసా ఇస్తున్నారు. ఒక్కొక్కరుగా చెన్నై వాసులను ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో చెన్నైతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా 'బాహుబలి' ప్రభాస్ కూడా చెన్నై వరద బాధితులకు విరాళం ప్రకటించి మంచి మనసు చాటుకున్నాడు. 15 లక్షల రూపాయలు చెన్నై వరద బాధితుల సహాయార్థం అందజేస్తున్నట్టు తెలిపాడు. ఇప్పటికే మహేశ్ బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, సంపూర్ణేష్ బాబు, నిఖిల్ తదితరులు విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే.