: 'స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ' ముస్లిం మహిళ చిత్రమా?


అమెరికాలో ప్రఖ్యాతి గాంచిన 'స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ' ఓ ముస్లిం మహిళకు సంబంధించిన చిత్రమా? అని నిపుణులు చర్చిస్తున్నారు. ఇది ముస్లిం మహిళకు సంబంధించిన ప్రతిరూపమేనని పలు ఆధారాలు చూపుతున్నారు. అమెరికా ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ స్వాతంత్ర్యాలకు ప్రతీకగా నిల్చే 'స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ' బురఖా ధరించిన ముస్లిం యువతి రూపమని వారు పేర్కొంటున్నారు. 1856లో ఈజిప్టులో పర్యటించిన ఫ్రెంచ్ శిల్పి ఫెడరిక్ అగస్టీ బర్ధోలీ ఈ విగ్రహాన్ని రూపొందించారు. పెద్ద విగ్రహాలను చెక్కే అలవాటున్న పెడరిక్ బర్ధోలీని 'సూయిజ్ కెనాల్' కు 'లైట్ హౌస్' డిజైన్ చేయాలని 1869లో ఈజిప్టు ప్రభుత్వం కోరింది. కాగడా పట్టుకుని కెనాల్ కు కాపలా కాస్తున్న ముస్లిం మహిళా రైతు రూపంలో ఆయన లైట్ హౌస్ కు డిజైన్ గీశారు. ఆ డిజైన్ లో మహిళ ఎడమ చేతితో కాగడా పట్టుకుని వెలుగు చూపుతున్నట్టు ఉంటుంది. దీనికి 'ఈజిప్ట్ బ్రింగ్స్ లైట్ టు ఏషియా' అని పేరు కూడా పెట్టారు. దీనిని పోలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీలో కుడి చేతితో కాగడా పట్టుకుని ఉంటుంది. ఈ క్రమంలో అమెరికా స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలను పురస్కరించుకుని ఫ్రెంచ్ ప్రభుత్వం ఓ పెద్ద విగ్రహాన్ని అమెరికాకు బహూకరించాలని భావించింది. దీని బాధ్యతను అప్పటి ఫ్రెంచ్ చరిత్ర కారుడు ఎడౌర్డ్ డీ లబైలాయే సలహాతో ఈ కాంట్రాక్టు ఫెడరిక్ కు ఫ్రెంచ్ ప్రభుత్వం అప్పగించింది. దీంతో 1870లో గతంలో తాను గీసిన చిత్రానికి పలు మార్పులు చేసి 'స్టాచ్యూ ఆప్ లిబర్టీ' రూపొందించాడు. దీనిని ఈఫిల్ టవర్ నిర్మించిన ప్రముఖ బిల్డర్ గుస్తావ్ ఈఫిల్ సహకారంతో ఫెడరిక్ పూర్తి చేశాడు. స్వేచ్ఛ, స్వాతంత్రాలకు స్ఫూర్తిగా ఫ్రాన్స్ దీనిని బహూకరించగా, 1886లో అమెరికా దీనిని ప్రతిష్ఠించింది. దీనిని ప్రతిష్ఠించడం సరికాదని అప్పట్లో విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ఫెడరిక్ తన తల్లిని స్పూర్తిగా తీసుకుని దీనిని రూపొందించారని మరో వాదం కూడా ఉంది. అదే సమయంలో అప్పట్లో ముస్లింల బురఖా తరహాలోనే క్రైస్తవులు కూడా దుస్తులు ధరించేవారని పలు చిత్రాలు చూపుతున్నాయి. అయితే వాటిని బురఖా అనే వారు కాదు. అంగీ అనే వారు. ముస్లిం మహిళలు ముఖం కనిపించకుండా వస్త్రం ధరించగా, క్రైస్తవులు వేరే వస్త్రంతో తలను కప్పుకునేవారు.

  • Loading...

More Telugu News