: చెన్నై సహాయకార్యక్రమాల పేరు ‘ఆపరేషన్ మదద్’
చెన్నై వరద బాధితులకు అందిస్తున్న సహాయ, పునరావాస కార్యక్రమాలకు ‘ఆపరేషన్ మదద్’ గా భారత వైమానిక దళం నామకరణం చేసింది. ఈ సహాయ చర్యల్లో సైన్యం, నావికాదళం, ఎయిర్‌ఫోర్స్, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందితో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా పాల్గొంటున్నాయి. హెలికాప్టర్ల ద్వారా ఆహార పొట్లాలు సరఫరా చేస్తున్నాయి. సైన్యం వైద్య బృందంతో పాటు మరో 9 సహాయ బృందాలు రంగంలోకి దిగాయి. చెన్నై విమానాశ్రయంలో చిక్కుకుపోయిన విమాన ప్రయాణికులను విమానాల ద్వారా హైదరాబాదుకు తరలిస్తున్నారు.