: ఇక నేను ఆగలేను...స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొంటా: విశాల్


ఇక తాను చూస్తూ ఊరుకోలేనని సినీ నటుడు, దక్షిణాది చలన చిత్ర మండలి ప్రధాన కార్యదర్శి విశాల్ తెలిపాడు. తనకు అత్యంత ఇష్టమైన నగరం నీట మునుగుతుంటే, నగర ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే చూస్తూ కూర్చోవడం చేతకావడం లేదని, స్వయంగా సహాయక చర్యల్లో పాలుపంచుకుంటానని విశాల్ ట్విట్టర్ ద్వారా తెలిపాడు. విశాల్ ఇప్పటికే చెన్నైకి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజపాళ్యంలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నాడు. వరదల్లో చిక్కుకున్న ప్రాంతాల వివరాలు సైన్యానికి అందిస్తూ, అక్కడి ప్రజలకు ఆహారం, మందులు, ఇతర సహాయ సామగ్రి అందిస్తూ తన సేవలు కొనసాగిస్తున్నాడు. చెన్నయ్ పరిస్థితి మరింత ఇబ్బందిగా మారిందని, తక్షణం చెన్నై వెళ్తానని విశాల్ తెలిపాడు. కాగా, విశాల్ అఫీషియల్ ట్విట్టర్ పేజ్ కు వినతుల వెల్లువ ఆగడం లేదు. సాయం చేయాలని వందలాది మంది కోరుతున్నారు. కోరిన ప్రతి ఒక్కరికీ సాయం చేస్తానని విశాల్ ఓపిగ్గా చెప్పడం విశేషం.

  • Loading...

More Telugu News