: గ్రేటర్ హైదరాబాద్ వాసులకు కేసీఆర్ వరాలు... విద్యుత్, నీటి బకాయిల మాఫీకి నిర్ణయం


తెలంగాణ సీఎం కేసీఆర్ గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు వరాలు కురిపించారు. విద్యుత్ బకాయిలు, మంచినీటి బిల్లుల బకాయిలపై మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, జలమండలి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రేటర్ పరిధిలో నెలకు 50 యూనిట్ల నుంచి వంద యూనిట్ల లోపు విద్యుత్తును వినియోగించుకుంటున్న పేదలకు నెలనెలా బిల్లులు చెల్లించలేకపోతున్నారని, మూడు లక్షల మంది పేదలు మంచినీటి బిల్లులు కూడా చెల్లించలేని దీనస్థితిలో ఉన్నట్టు సీఎంకు అధికారులు వివరించారు. ఈ క్రమంలో 6 లక్షల మంది నుంచి రూ.128 కోట్ల విద్యుత్ బకాయిలు, 3 లక్షల మంది పేదల నుంచి రావాల్సిన రూ.295 కోట్ల నల్లా బకాయిలు పేరుకుపోయాయని వివరించారు. ఆ వెంటనే వాటిని రద్దు చేయాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఉత్తర్వులు జారీ చేయలేమని సీఎం తెలిపారు. ఎన్నికల కోడ్ ముగిశాక ఉత్తర్వులు విడుదల చేస్తామన్నారు.

  • Loading...

More Telugu News