: ఇళ్లు, బంధువులు ఉన్నవాళ్లు ఓకే...మరి వలస కూలీల పరిస్థితి?: మదరాసీల దుస్థితి
తెరపి లేకుండా కురిసిన వర్షాలకు చెన్నై నీటమునిగింది. దీంతో వివిధ రకాల పనుల కోసం చెన్నయ్ వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెన్నయ్ లో స్థిర నివాసం ఉన్నవారు ఎలాగోలా రక్షణ పొందారు. బహుళ అంతస్తుల భవనాలు ఉన్నవారు వర్షాల బారి నుంచి రక్షణకు పై అంతస్తులకు వెళ్లిపోగా, బహుళ అంతస్తుల భవనాలు లేని వారు, బంధువుల ఇళ్లలో తల దాచుకున్నారు. ఎటొచ్చీ, స్థిర నివాసం, బంధుగణం లేని వలస కూలీలు మాత్రం రోడ్డున పడ్డారు. ఉన్న గూడును వర్షపు నీరు కబళించగా, ఎటెళ్లాలో దిక్కు తోచని స్థితిలో వారంతా, బస్టాండులు, రైల్వే స్టేషన్లకు చేరారు. చెన్నై నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సులు, రైళ్లు రద్దు కావడంతో ఆ విధంగా వారికి కాస్త ఆసరా దొరికినట్టైంది. తిండికి ఎలాగోలా సర్దుకుపోతున్నప్పటికీ వసతి లేక వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.