: రాణించిన రహానే...భారత్ 231/7
ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరుగుతున్న నాలుగో టెస్టులో తొలి రోజు ఆటలో అజింక్యా రహనే (89) సఫారీ బౌలర్లను అడ్డుకుని సెంచరీ దిశగా సాగుతున్నాడు. 2-0తో సిరీస్ ఇప్పటికే సొంతం చేసుకున్న భారత జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించింది. నాలుగో టెస్టు తొలిరోజు 84 ఓవర్లు ఆడిన భారత జట్టు ఏడు వికెట్లు కోల్పోయి 231 పరుగులు చేసింది. టీమిండియా ఆటగాళ్లలో మురళీ విజయ్ (12), శిఖర్ ధావన్ (33), ఛటేశ్వర్ పుజారా (14), విరాట్ కోహ్లీ (44) ఫర్వాలేదనిపించగా, రోహిత్ శర్మ (1), వృద్ధిమాన్ సాహా (1) పూర్తిగా విఫలమయ్యారు. రవీంద్ర జడేజా (24) ఓ మోస్తరుగా ఆడగా, రహానేకు అండగా రవిచంద్రన్ అశ్విన్ (6) క్రీజులో ఉన్నాడు. సౌతాఫ్రికా బౌలర్లలో పిడిట్ నాలుగు వికెట్లతో రాణించగా, అబోట్ మూడు వికెట్లు తీసి సత్తాచాటాడు.