: చైనా సంపన్నులపై ఒత్తిడి పెంచుతోన్న జుకెర్ బర్గ్ నిర్ణయం!


కుమార్తె పుట్టిన సందర్భంగా కంపెనీలోని తన వాటాకు చెందిన 99 శాతం షేర్లను ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకెర్ బర్గ్ విరాళంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ లెక్కన 3లక్షల కోట్ల రూపాయలు స్వచ్ఛంద సంస్థలకు వెళ్లనున్నాయి. గొప్ప మనసుతో ఆయన తీసుకున్న నిర్ణయం చైనాలోని సంపన్నులపై ఒత్తిడి పెంచుతోంది. చైనా యువతిని వివాహం చేసుకున్న జుకెర్ బర్గ్ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన హ్యాష్ ట్యాగ్ తో దానిని వైబోలో పెడితే ఒక్క రోజులో 50 లక్షల మంది చూశారట. మధ్యతరగతి యువతిని వివాహం చేసుకుని, లక్షల కోట్ల రూపాయలకు అధిపతి అయినా మధ్య తరగతి జీవితం జీవిస్తూ, సాధారణ దుస్తులు ధరిస్తూ జుకెర్ బర్గ్ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు ఆయనను ఆకాశానికెత్తేస్తున్నారు. అంతటితో ఆగకుండా చైనా సంపన్నులపై సెటైర్లు వేస్తున్నారు. చైనా సంపన్నులు విలాసవంతమైన జీవితం గడపడానికి, కొత్త కొత్త కార్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, ఈ మధ్య ఓ సర్వేలో అమెరికా కంటే చైనాలో ఎక్కువ మంది సంపన్నులున్నట్టు తేలిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News