: ప్రియురాలు హత్య కేసులో మళ్లీ దోషిగా పిస్టోరియస్


పారాలింపియన్ ఆస్కార్ పిస్టోరియస్ మరోసారి దోషిగా తేలాడు. ప్రియురాలు రీవా స్టీన్ క్యాంప్ ను కాల్చి చంపిన కేసులో తాజాగా దక్షిణాఫ్రికా సుప్రీంకోర్టు పైవిధంగా తీర్పు వెల్లడించింది. కేసులో విచారణ జరిపిన కోర్టు ఆస్కార్ ఉద్దేశపూర్వకంగానే తన ప్రియురాలిని హత్య చేశాడని... ఇందుకు అతనికి తగిన శిక్ష విధించాలని అభిప్రాయపడింది. ప్రియురాలి హత్య కేసులో గతేడాది అతనికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష పడింది. సంవత్సరకాలం జైలు శిక్ష తరువాత ఆస్కార్ అక్టోబర్ లో పెరోల్ మీద విడుదలయ్యాడు. అయితే అతన్ని వదిలిపెట్టడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దాంతో కేసును సుప్రీంకోర్టు మళ్లీ విచారించి దోషిగా నిర్ధారించింది. ఈ క్రమంలో అతనికి తగిన శిక్ష విధించాలని ట్రయల్ కోర్టుకు కేసును తిప్పి పంపింది. ఈసారి అతనికి 15 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News