: అలాంటి పరిస్థితుల్లో భార్య ఒప్పుకున్నా విడాకులు ఇవ్వడం కుదరదు: సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టు ఈ రోజు ఒక సంచలన తీర్పును వెలువరించింది. క్యాన్సర్ తో బాధ పడుతున్న భార్య నుంచి విడాకులు ఇప్పించాలని కోరుతూ ఓ వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. రూ. 12.50 లక్షల భరణం తీసుకోవడానికి అతని భార్య కూడా అప్పటికే అంగీకరించింది. అయితే, సుప్రీంకోర్టు మాత్రం విడాకులు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. "హిందూ వ్యవస్థలో భార్య తన భర్తను దైవంగా భావిస్తుంది. పెళ్లైన తర్వాత తన కుటుంబాన్ని వదిలి భర్త కుటుంబాన్నే తన కుటుంబంగా భావిస్తుంది. బిడ్డలు, భర్త కోసం జీవిస్తుంది. అలాంటి భార్యకు అనారోగ్య స్థితిలో విడాకులు మంజూరు చేయడం కుదరదు. ఆమె ఒప్పుకున్నా కోర్టు మాత్రం ఒప్పుకోదు" అని సుప్రీంకోర్టు బెంచ్ తీర్పును వెలువరించింది. అంతేకాకుండా, ముందు ఆమెకు రూ. 5 లక్షలు ఇవ్వాలని, ఆమె పూర్తిగా కోలుకున్న తర్వాత మాత్రమే విడాకుల అంశాన్ని పరిశీలిస్తామని తేల్చి చెప్పింది.