: హైదరాబాద్ లో ఐఫా అవార్డుల వేడుకల్ని వాయిదా వేయాలని కేసీఆర్ ఆదేశం
హైదరాబాద్ లో ఈ నెల 4 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఐఫా(ఇంటర్నేషనల్ ఇండియా ఫిల్మ్ అకాడమీ) అవార్డుల వేడుకలను వాయిదా వేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. తమిళనాడు రాజధాని చెన్నై సహా పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు వందలాది మంది చనిపోయారు. ఇలాంటి సమయంలో వేడుకలు నిర్వహించడం భావ్యం కాదని పేర్కొన్నారు. మరి దానిపై నిర్వాహకులు ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది. ఈ వేడుకలు ఇప్పటివరకు బాలీవుడ్ లో మాత్రమే జరిగేవి. దక్షిణ భారత చలనచిత్ర రంగాన్ని దృష్టిలో ఉంచుకుని తొలిసారిగా ఇక్కడ వేడుకలను నిర్వహించాలని నిర్ణయించారు.