: తన రికార్డును కుమారులు అధిగమించాలని సెహ్వాగ్ కోరిక
టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ ను ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో బీసీసీఐ ఈరోజు సన్మానించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వీరూ తన ఇద్దరు కుమారుల ముందు ఓ సవాల్ ఉంచాడు. 2008లో దక్షిణాఫ్రికాతో ఆడిన టెస్టులో తాను చేసిన 319 పరుగుల రికార్డును కుమారులిద్దరూ అధిగమించాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు. ఆ రికార్డును తన కుమారులు ఏ స్థాయిలోనైనా బద్దలు కొడితే వారికి ఫెరారీ కారు బహుమతిగా ఇస్తానని కామెంటేటర్ హర్షా బోగ్లేతో ముచ్చటిస్తూ చెప్పాడు. ఆ రికార్డును తాను నెలకొల్పడం ఆనందంగా ఉందన్నాడు. కాగా, తన కెరీర్ అభివృద్ధికి సహకరించిన మాజీ కెప్టెన్లు సౌరవ్ గంగూలీ, అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్ సచిన్ టెండూల్కర్ లకు రుణపడి ఉంటానని సెహ్వాగ్ తెలిపాడు.