: ఏపీలో ఇసుక మాఫియా వ్యవహారాలన్నీ చంద్రబాబుకు తెలిసే జరుగుతున్నాయి: సీపీఐ నారాయణ
ఆంధ్రప్రదేశ్ లో ఇసుక మాఫీయా అక్రమాలపై సీపీఐ నారాయణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం చంద్రబాబుకు తెలిసే రాష్ట్రంలో ఇసుక మాఫియా జరుగుతోందని ఆరోపించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఇసుక మాఫియాలో ఉన్నారని, వీరంతా బోలెడు సంపాదించారని చెప్పారు. ఇక ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఈ నెల 7న ఢిల్లీలోని జంతర్ మంతర్ లో భారీ స్థాయిలో ధర్నా చేయనున్నట్టు తెలిపారు. హోదా విషయంలో ఏపీ ప్రజలను కేంద్రం మభ్యపెడుతోందని, మోదీ, వెంకయ్య, చంద్రబాబు ప్రజలకు మూడు నామాలు పెడుతున్నారని మండిపడుతున్నారు.