: మూడు వికెట్లు కోల్పోయిన భారత్
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నాలుగో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతోంది. 30 పరుగుల వద్ద తొలి వికెట్, 62 పరుగుల వద్ద రెండో వికెట్, 66 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. మురళీ విజయ్ (12), శిఖర్ ధావన్ (33), పుజారా (14) పెవిలియన్ చేరారు. పెడిట్ రెండు వికెట్లు పడగొట్టగా, అబాట్ ఒక వికెట్ తీశాడు. విరాట్ కోహ్లీ (29), రహానే (23) సమయానుకూలంగా ఆడుతూ స్కోరు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం టీమిండియా స్కోరు మూడు వికెట్ల నష్టానికి 114 పరుగులు.