: ప్రాణాలను కాపాడతానంటూ 200 మందికి ఎయిడ్స్ ఎక్కించాడు


ప్రాణాలను కాపాడే వైద్యుడిని మనం సాక్షాత్తు దేవుడిగా భావిస్తాం. అయితే, ఈ మధ్య కాలంలో దొంగ వైద్యులు పుట్టుకొస్తూ, ప్రాణాలను హరిస్తున్నారు. ఇలాంటి ఘటనలు మన దేశంలోనే కాదు... ఇతర దేశాల్లో కూడా జరుగుతున్నాయి. కాంబోడియాలో యెమ్ చరిన్ (57) అనే వ్యక్తి ఎటువంటి డిగ్రీలు లేకపోయినా వైద్యుడి అవతారం ఎత్తాడు. బట్టామాబాంగ్ ప్రావిన్స్ లో రోఖా అనే గ్రామీణ తెగకు వచ్చీ రాని వైద్యం చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నాడు. అయితే, ఒకరికి ఉపయోగించిన నీడిల్ నే మరొకరికి వాడుతూ వైద్యం చేశాడు. ఈ క్రమంలో 200 మందికి పైగా ఎయిడ్స్ సోకింది. వీరిలో ఇప్పటికే పది మందికి పైగా మరణించారు. ఎయిడ్స్ సోకిన వారంతా 15 నుంచి 49 ఏళ్ల మధ్య వయసువారే. ఈ తప్పిదానికి పాల్పడినందుకు యెమ్ చరిన్ పై కాంబోడియా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 25 ఏళ్ల కారాగార శిక్షను విధించింది.

  • Loading...

More Telugu News