: సాయన్న హ్యండిచ్చినా నష్టం లేదు... గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటుతాం: ఎర్రబెల్లి
‘‘టీడీపీ ప్రజల పార్టీ, ప్రజా బలం ఉన్న పార్టీ. నేతలెంత మంది పార్టీని వీడినా, కార్యకర్తలు పార్టీ వెంటే ఉన్నారు. త్వరలో జరగనున్న నారాయణ్ ఖేడ్, గ్రేటర్ ఎన్నికల్లో ఈ విషయం తేటతెల్లమవుతుంది’’ ఇదీ కంటోన్మెంట్ ఎమ్మెల్యే, సీనియర్ నేత సాయన్న పార్టీని వీడిన తర్వాత టీ టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందన. సాయన్న పార్టీని వీడటంపై ఎర్రబెల్లి ఆగ్రహంతో పాటు ఆవేదన వ్యక్తం చేశారు. సాయన్న లాంటి సీనియర్ నేత పార్టీని వీడతారని అనుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు. సాయన్నను పార్టీ అన్ని విధాలుగా గౌరవించిందని, అయితే పార్టీకి ద్రోహం చేస్తూ సాయన్న పార్టీని వీడారని ఆయన ధ్వజమెత్తారు. నాయకులు వెళ్లినంత మాత్రాన పార్టీ బలహీనపడదని ఆయన చెప్పారు. త్వరలో నారాయణ్ ఖేడ్ అసెంబ్లీకి, గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ కు జరగనున్న ఎన్నికల్లో పార్టీ సత్తా చాటుతామని ఆయన ప్రకటించారు.