: చింటూ రాయల్ నిన్నటిదాకా టీడీపీ నేతే!... బహిష్కరించిన సైకిల్ పార్టీ


ఏపీలో అధికార పార్టీ టీడీపీకి సంబంధించి చిత్తూరు జిల్లా శాఖలో కీలక నేత కఠారి మోహన్. నగరపాలక సంస్థ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన మోహన్ భార్య కఠారి అనురాధ ఆ తర్వాత మేయర్ గా ఎన్నికయ్యారు. ఇక వీరిద్దరినీ పొట్టనబెట్టుకున్న వారి మేనల్లుడు చింటూ రాయల్ అలియాస్ శ్రీరామ చంద్రశేఖర్ కూడా టీడీపీ నేతగానే ఉన్నారు. నిన్నటిదాకా ఆయన టీడీపీ నేతనే. నగరంలోని 70వ వార్డులో ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న అతడికి 09400586 నెంబరు మీద ఐడీ కార్డు కూడా జారీ అయ్యింది. కఠారి దంపతుల హత్య తర్వాత ఆ పార్టీ జిల్లా శాఖ కార్యవర్గం షాక్ కు గురైంది. ఇక ఈ హత్యోదంతంలో చింటూకు సహకరించిన ఓ మహిళా కార్పొరేటర్ భర్త మురుగన్ కూడా టీడీపీ నేతగానే ఉన్నారు. కఠారి హత్యలతో అయోమయంలో పడిపోయిన పార్టీ జిల్లా కార్యవర్గం అటు చింటూ సభ్యత్వంపై కాని, మురుగన్ సభ్యత్వంపై కాని దృష్టి సారించలేదు. అయితే మొన్న చింటూ రాయల్ చిత్తూరు కోర్టులో లొంగిపోయిన తర్వాత ఈ కేసు ఓ కొలిక్కి వచ్చినట్లైంది. చింటూ లొంగుబాటుతో పార్టీ సభ్యత్వాలపై దృష్టి సారించిన జిల్లా కార్యవర్గం చింటూతో పాటు మురుగన్, అతడి భార్య (చిత్తూరులోని ఓ వార్డు కార్పొరేటర్) సభ్యత్వాలను రద్దు చేసేసింది.

  • Loading...

More Telugu News