: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా టీఎస్ ఠాకూర్ ప్రమాణస్వీకారం


భారత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా టీఎస్ ఠాకూర్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. సర్వోన్నత న్యాయస్థానం 43వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఇప్పటిదాకా చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు నిర్వహించిన హెచ్.ఎల్.దత్తు నిన్న పదవీ విరమణ చేశారు. సుప్రీం చీఫ్ జస్టిస్ గా 2017 జనవరి 3వ తేదీ వరకు జస్టిస్ ఠాకూర్ వ్యవహరిస్తారు. ఈ పదవిలో ఆయన 13 నెలల పాటు కొనసాగనున్నారు. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కు సంబంధించి సుప్రీంకోర్టు జడ్జిగా కీలకమైన తీర్పును వెలువరించింది ఠాకూరే కావడం గమనార్హం.

  • Loading...

More Telugu News