: సిరియాలోని ఐఎస్ స్థావరాలపై బ్రిటన్ వైమానిక దాడులు
సిరియాకు చెందిన ఐఎస్ఐఎస్ స్థావరాలపై తాజాగా బ్రిటన్ వైమానిక దాడులు మొదలుపెట్టింది. ఈ దాడుల్లో ఇస్లామిక్ స్టేట్ కు చెందిన పలు స్థావరాలు ధ్వంసమైనట్టు తెలుస్తోంది. మధ్యయుగపు రాక్షసులపై బాంబుల వర్షం కురిపించాలని ఆ దేశ ప్రధాని డేవిడ్ కామెరాన్ ఇచ్చిన పిలుపుతో... ఆ దేశ పార్లమెంటులో 397-223 ఓట్ల తేడాతో నిన్న (బుధవారం) బిల్లు ఆమోదం పొందింది. ఆ తరువాత కొన్ని గంటల్లోనే ఐఎస్ స్థావరాలపై రాయల్ బ్రిటీష్ ఎయిర్ ఫోర్స్ విరుచుకుపడటం గమనార్హం.