: ఢిల్లీలో బాలయ్య.. పలువురు కేంద్ర మంత్రులతో భేటీకి సిద్ధం


టాలీవుడ్ నట సింహం, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. భారీ ప్రణాళికతోనే దేశ రాజధానిలో అడుగుపెట్టిన బాలయ్య మరికాసేపట్లో (మధ్యాహ్నం 12 గంటలకు) కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ సహాయ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ తో భేటీ కానున్నారు. ఆ తర్వాత పార్లమెంటుకు వెళ్లనున్న బాలయ్య కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడును కూడా కలవనున్నారు. తదనంతరం మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, 3.30 గంటలకు రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభుతోనూ బాలయ్య వరుస భేటీలు నిర్వహిస్తారు.

  • Loading...

More Telugu News