: మోదీజీ... నా పెళ్లికి రండి: ప్రధానికి రోహిత్ ఇన్విటేషన్!
టీమిండియా స్టైలిష్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ ఈ నెల 13న పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. తాను ప్రేమించిన రితికా సజ్ దేను అతడు పెళ్లాడనున్నాడు. ఇప్పటికే ఈ వివాహానికి సంబంధించిన ఏర్పాట్లలో రోహిత్ నిండా మునిగిపోయాడు. నిన్న ఢిల్లీ వెళ్లిన రోహిత్ శర్మ నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశాడు. తన వివాహ ఆహ్వాన పత్రికతో ప్రధాని అధికారిక నివాసానికి వెళ్లిన రోహిత్, తన పెళ్లికి రావాలని మోదీని కోరాడు. రోహిత్ భుజం తట్టిన నరేంద్ర మోదీ, అతడి ఆటతీరును ప్రశంసించారు. అయితే రోహిత్ పెళ్లికి మోదీ హాజరవుతున్నదీ, లేనిదీ మాత్రం తెలియరాలేదు.