: సిరిసిల్ల మాధవి సస్పెన్షన్... ప్రొఫెసర్ పదవి నుంచి తప్పించిన కాకతీయ వర్సిటీ
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కుటుంబంపై సర్కారీ చర్యలు షురూ అయ్యాయి. రాజయ్య కోడలు సిరిసిల్ల సారిక, తన ముగ్గురు కొడుకులతో కలిసి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం కావడంతో సిరిసిల్ల రాజయ్యతో పాటు ఆయన భార్య మాధవి, కొడుకు అనిల్ కుమార్ (సారిక భర్త)లను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వీరితో పాటు అనిల్ రెండో భార్యగా భావిస్తున్న సన కూడా వరంగల్ సెంట్రల్ జైల్లో ఉన్నారు. రాజయ్య సతీమణి మాధవి వరంగల్ లోని కాకతీయ విశ్వవిద్యాలయంలోని బయోటెక్నాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. కేసులో ఇరుక్కుని అరెస్ట్ అయిన ఆమెను విధుల నుంచి తప్పిస్తూ (సస్పెన్షన్) వర్సిటీ అధికారులు నిన్న రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.