: చెన్నై బాధితులకు నా మొదటి నెల జీతం: తేజస్వి యాదవ్
చెన్నై వరద బాధితులకు తన మొదటి నెల జీతాన్ని విరాళంగా ప్రకటిస్తున్నానని బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలన్నారు. అది మన కనీస ధర్మమన్నారు. మానవతాదృక్పథంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని ఆ ట్వీట్ లో తేజస్వి తెలిపారు.