: ఇన్ఫోసిస్, జయ టీవీ ఆఫీసుల్లోకి వరద నీరు


తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పుతియ తలైమురై, జయ టీవీ ఆఫీసుల్లో వరద నీరు వచ్చి చేరింది. దీంతో, ఛానళ్ల ప్రసారానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాగా, ఇన్ఫోసిస్ క్యాంపస్‌లోకి కూడా వరద నీరు చేరింది. దీంతో ఇన్ఫోసిస్‌కు రేపు కూడా సెలవును ప్రకటించారు. కీలక సేవలను కొనసాగించేందుకు ఇన్ఫోసిస్ కార్యాలయాల్లోనే కాగ్నిజెంట్ సిబ్బంది కూడా ఉన్నారు. చెన్నైలో మొత్తం 11 చోట్ల కాగ్నిజెంట్ కార్యాలయాలుండగా, 60వేల మంది ఉద్యోగులున్నారు. ముఖ్యమైన సేవలకు అంతరాయం కలగకుండా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. చెన్నైలో కురుస్తున్న వర్షాలకు 70 శాతం మేర విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

  • Loading...

More Telugu News