: నటుడు సిద్ధార్థ్ ఇంట్లోకి వచ్చేసిన వర్షపు నీరు!


చెన్నయ్ లో కురుస్తున్న భారీ వర్ష ప్రభావాన్ని ఇప్పుడు సినీ నటుడు సిద్ధార్థ్ కూడా చవిచూశాడు. చెన్నైలోని ఈ నటుడి ఇంట్లోకి కూడా వర్షం నీరు వచ్చిందని ట్విట్టర్ లో వెల్లడించాడు. దాంతో తాము పై అంతస్తుకు వెళుతున్నామని తెలిపాడు. తమ ఇంట్లోకి నీరు వచ్చిన ఫోటోలను ట్విట్టర్ లో సిద్ధార్థ్ పోస్టు చేసి పరిస్థితిని వివరించాడు. డ్రెయిన్ ల నుంచి నీరు బయటకు వస్తోందని, 'నా లాంటి నటుల పరిస్థితే ఇలా ఉంటే, రాష్ట్రంలో ప్రజల పరిస్థితి మీరే ఊహించుకోండి' అంటూ సిద్ధూ ట్వీట్ చేశాడు. తమిళనాడును దేవుడే కాపాడాలని కోరాడు. మరోవైపు చెన్నైలో తన స్నేహితులు, మరికొంతమంది సాయంతో ఆహారపు పొట్లాలు, మంచినీరు సేకరించి సాయం చేసేందుకు తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు.

  • Loading...

More Telugu News