: తమిళనాడుకు రూ. 15 వేల కోట్ల నష్టం: అసోచామ్


భారీ వర్షాలతో తమిళనాడు అతలాకుతలం అయింది. గత వందేళ్లలో ఎన్నడూ లేనంతగా కుంభవృష్టి పడడంతో చెన్నై సహా పలు జిల్లాలు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో, తమిళనాడుకు రూ. 15 వేల కోట్ల నష్టం వాటిల్లిందని అసోచామ్ అంచనా వేసింది. అనేక పరిశ్రమలు దెబ్బతిన్నాయని, రోడ్డు, రైలు, విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడిందని, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు నష్టం వాటిల్లిందని తెలిపింది. 188 మంది ప్రాణాలు కోల్పోయారని, ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది.

  • Loading...

More Telugu News