: కోల్ కతాలో మరో ఐఎస్ఐ ఏజెంట్ అరెస్ట్


పశ్చిమబెంగాల్ రాజధాని కోల్ కతాలో పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐకు చెందిన మరో ఏజెంటును పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి పాస్ పోర్ట్ కార్యాలయం బయట అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇతనితో కలిపి కోల్ కతాలో అరెస్టైన ఐఎస్ఐ ఏజెంట్ల సంఖ్య నాలుగుకు చేరింది. భారత్ లో మొత్తం వెయ్యి మంది ఏజెంట్లు ఉన్నారని నిఘావర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే జమ్ము కశ్మీర్ లో, ఢిల్లీలో ఒక్కొక్కరిని అరెస్ట్ చేశారు. బెంగాల్ లో అరెస్టైన వారిలో కాంట్రాక్ట్ లేబరర్, అతని కుమారుడు, అతని బంధువు ఉన్నారు. ఇటీవలే మహ్మద్ కలాం అనే ఐఎస్ఐ ఏజెంట్ ను మీరట్ లో అరెస్ట్ చేశారు. అతడిని విచారించడంతో మరికొందరి వివరాలు కూడా తెలుస్తున్నాయి.

  • Loading...

More Telugu News