: దానం నాగేందర్ పై వేటు వేస్తారా?


మాజీ మంత్రి, గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దానం నాగేందర్ పై ఆ పార్టీ ముఖ్య నేతలు మండిపడుతున్నారు. పార్టీ కార్యక్రమాల పట్ల దానం అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు గ్రేటర్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంటే... దానం మాత్రం నిమ్మకునీరెత్తినట్టు ఉంటున్నాడని అంటున్నారు. ఇదే విధంగా కొనసాగితే, వరంగల్ ఉప ఎన్నిక ఫలితమే గ్రేటర్ ఎన్నికల్లో కూడా రిపీట్ అవుతుందని భావిస్తున్నారు. ఈ క్రమంలో గ్రేటర్ అధ్యక్ష పదవి నుంచి దానంను తొలగించాలనే నిర్ణయానికి పీసీసీ వచ్చినట్టు సమాచారం. ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ సమన్వయ కమిటీ కాసేపట్లో సమావేశం కానుంది. దానం వ్యవహార తీరుపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. తన వ్యవహారశైలి పట్ల దానం సరైన సమాధానం ఇవ్వకుంటే గ్రేటర్ అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని నిర్ణయించారు.

  • Loading...

More Telugu News