: షీనా బోరా హత్య కేసులో కీలక ఆధారం వెల్లడించిన కారు డ్రైవర్
సంచలన షీనా బోరా హత్య కేసులో ఇంతవరకు తెలియని ఓ కీలక విషయం బయటికొచ్చింది. బోరాను హత్య చేసేందుకు 'స్కైప్' యాప్ ద్వారా ప్రణాళిక చేసుకున్నట్లు ఇంద్రాణి కారు డ్రైవర్ శ్యామ్ వర్ రాయ్ సీబీఐ విచారణలో తెలిపాడు. 2012లో ఇంద్రాణి తన సెక్రటరీ ద్వారా స్కైప్ ఐడీ క్రియేట్ చేసుకుందని, తరువాత షీనా, మిఖాయెల్ ను హత్య చేయాలని భావిస్తున్నట్టు తనకు తెలిపిందని చెప్పాడు. హత్యకు ముందే షీనాకు విషం కలిపిన నీళ్లను ఇచ్చిందని, తరువాత ఒకచోట కారు ఆపి ఆమె గొంతు నులిమి ఇంద్రాణి చంపేసిందని డ్రైవర్ వెల్లడించాడు. మరోవైపు ఈ కేసులో అరెస్టైన ఇంద్రాణి భర్త పీటర్ ముఖర్జియాకి ఈ నెల 14 వరకు కోర్టు జుడీషియల్ రిమాండ్ విధించింది.