: జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆనం వివేకా


రాజశేఖర్ రెడ్డి కుమారుడిని అని చెప్పుకునే నైతికత కూడా వైకాపా అధినేత జగన్ కు లేదని టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బంగారం లాంటి రాజశేఖర్ రెడ్డిని జగన్ చెడగొట్టేశారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని విడగొట్టి తెలుగు ప్రజల మనోభావాలను కాంగ్రెస్ దెబ్బ తీసిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలంటే మరో 30 ఏళ్లు పడుతుందని... ఇలాంటి పరిస్థితిలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లగలిగిన సత్తా చంద్రబాబుకే ఉందని చెప్పారు. చంద్రబాబుకు నైతిక మద్దతు ఇచ్చేందుకే టీడీపీలో చేరామని తెలిపారు. పని చేసే చంద్రబాబుతో చేరాలి కాని దొంగలు, రౌడీలతో కాదని ఎద్దేవా చేశారు. వైకాపా నేతలు కూడా టీడీపీలో చేరతారని చెప్పారు. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News