: చెన్నైలో వర్షాల కారణంగా పలు రైళ్లు పూర్తిగా రద్దు
చెన్నైలో కురుస్తున్న భారీ వర్షాలతో పట్టాలపైకి వరద నీరు చేరడంతో పలు రైళ్లు రద్దయ్యాయి. చెన్నై-విజయవాడ జనశతాబ్ది ఎక్స్ ప్రెస్, చెన్నై-హౌరా కోరమాండల్ ఎక్స్ ప్రెస్, చెన్నై-అహ్మదాబాద్ నవజీవన్ ఎక్స్ ప్రెస్, విజయవాడ-చెన్నై సెంట్రల్ జనశతాబ్ది ఎక్స్ ప్రెస్, చెన్నై- శ్రీమాతా వైష్ణోదేవి కత్రి ఎక్స్ ప్రెస్, పాండిచ్చేరి-న్యూఢిల్లీ, చెన్నై-న్యూ జలపాయిగ్రి రైళ్లను పూర్తిగా రద్దు చేసినట్టు రైల్వేశాఖ ప్రకటించింది. మరికొన్ని రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు తెలిపింది. మరోవైపు వర్షాల కారణంగా తమిళనాడులోని 9 జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. చెన్నై-తిరుచ్చి మార్గంలో గూడూవాంజేరి వద్ద జాతీయ రహదారి పూర్తిగా ధ్వంసమైంది. దాంతో చెన్నై-బెంగళూరు మార్గంలో వాహనాలను మళ్లించారు.