: చెన్నైలో నీట మునిగిన ఐటీ కారిడార్... యాక్సెంచర్, ఇన్ఫోసిస్ ఆఫీసుల్లోకి వరద నీరు
తమిళనాడు రాజధాని చెన్నైలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నగరంలోని ఐటీ కారిడార్ మొత్తం నీట మునిగింది. ప్రముఖ ఐటీ కంపెనీలు యాక్సెంచర్, ఇన్ఫోసిస్ కార్యాలయాల్లోకి వరద నీరు చేరిపోయింది. దీంతో ఈ కార్యాలయాల్లో రోజువారీ కార్యకలాపాలు నిలిచిపోయాయి. 10 రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి కూడా చెన్నైలోని దాదాపు అన్ని ఐటీ కంపెనీలు తమ రోజువారీ కార్యకలాపాలను పొరుగు రాష్ట్రం కర్ణాటక రాజధాని బెంగళూరుకు తాత్కాలికంగా షిఫ్ట్ చేశాయి. తాజాగా మళ్లీ ఈ కంపెనీలు మరోమారు బెంగళూరు బాట పట్టక తప్పడం లేదు. రోజువారీ కార్యకలాపాలతో పాటు చెన్నైలోని సిబ్బందిని కూడా ఐటీ కంపెనీలు బెంగళూరుకు తరలించనున్నట్లు సమాచారం.