: నెల్లూరు, చిత్తూరు జిల్లాలను చుట్టుముట్టిన వర్షం... జలదిగ్బంధంలో చిక్కుకున్న పల్లెలు


మొన్నటి వర్ష బీభత్సం నుంచి ఏపీలోని నెల్లూరు, చిత్తూరు జిల్లాలు ఇంకా తేరుకోనేలేదు. అప్పుడే మరోమారు వరుణుడు ఆ జిల్లాలపై పెను ప్రభావం చూపాడు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి కారణంగా రెండు రోజులుగా ఈ రెండు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షం కారణంగా ఈ జిల్లాల్లోని జలాశయాలన్నీ పూర్తిగా నిండటమే కాక పొంగి పొరలుతున్నాయి. నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట, నాయుడుపేట, గూడురు, వెంకటగిరి, ఆత్మకూరు తదితర ప్రాంతాల్లోని మెజారిటీ పల్లెలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. జిల్లా పరిధిలోని స్వర్ణముఖి, కైవల్యా నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో రహదారులు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాయి. ఇక చిత్తూరు జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గ్రామాల్లో చిక్కుకుపోయిన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. భారీ వర్షాల కారణంగా జిల్లావ్యాప్తంగా నేడు విద్యాలయాలకు సెలవును ప్రకటిస్తూ జిల్లా విద్యాశాఖాధికారి ఉత్తర్వులు జారీ చేశారు.

  • Loading...

More Telugu News