: అమరావతికి కూచిపూడి చిన్నారి విరాళం...కిడ్డీ బ్యాంకును చంద్రబాబుకు అందించిన వైనం
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. పెద్ద సంఖ్యలో ఎన్నారైలతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వ్యక్తులు తమ వంతుగా విరాళాలు అందజేస్తున్నారు. అసలు అమరావతి అంటే ఏమిటో కూడా తెలియని చిన్నారులు కూడా విరాళాలను అందజేస్తూ ప్రభుత్వానికి బాసటగా నిలుస్తున్నారు. గుంటూరు జిల్లా వేమూరులో నేటి ఉదయం టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడికి కూచిపూడి గ్రామానికి చెందిన చిన్నారి బాలిక కరుణచౌదరి తన కిడ్డీ బ్యాంకును అందజేసింది. టీడీపీ జనచైతన్య యాత్రలను ప్రారంభించేందుకు వచ్చిన చంద్రబాబుకు ఆ బాలిక విరాళాన్ని అందజేసింది. చిన్న వయసులోనే మంచి పనిచేశావని ఆ బాలికను చంద్రబాబు ప్రశంసించారు.