: కడపలో ఏడుగురు అంతర్జాతీయ స్మగ్లర్ల అరెస్టు


కడపలో తాజాగా ఏడుగురు అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టయ్యారు. వారిలో ఇద్దరు చైనా స్మగ్లర్లు జూది, సూని ఉన్నట్టు పోలీసులు తెలిపారు. రూ.15 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలు, కారు, ల్యాప్ ట్యాప్, 11 సెల్ ఫోన్లు, విదేశీ కరెన్సీని వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. త్వరలోనే ఏడుగురు స్మగ్లర్లను కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు చెప్పారు. విదేశీ స్మగ్లర్ల వెనుక ఎవరున్నారు, ఈ తంతంగాన్ని ఎవరు నడుపుతున్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. వీరందరినీ జిల్లాలోని చెన్నూరు మండలం దౌలతాపురంలో పోలీసులు అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News