: ఆమెను రాళ్లతో కొట్టి చంపండి... పనిమనిషికి సౌదీ కోర్టు శిక్ష


సౌదీ అరేబియాలో ఓ పనిమనిషికి అక్కడి కోర్టు దారుణమైన శిక్ష విధించింది. ఆమెను రాళ్లతో కొట్టి చంపాలని తీర్పు ఇచ్చింది. వివరాల్లోకి వెళితే... శ్రీలంక నుంచి సౌదీ అరేబియా వెళ్లిన ఓ మహిళ (45)... 2013 నుంచి రియాద్ లో ఒకరింట్లో పనిమనిషిగా చేస్తోంది. తరువాత లంక నుంచి సౌదీకి వచ్చిన ఒక వ్యక్తితో ఆమెకు సాన్నిహిత్యం ఏర్పడింది. ఈ క్రమంలో ఇద్దరికీ వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ విషయం కాస్తా కోర్టుకు చేరడంతో ఇద్దరినీ దోషులుగా నిర్ధారిస్తున్నట్టు గత ఆగస్టులో కోర్టు ప్రకటించింది. తన భర్తను మోసం చేసి వేరే పురుషుడితో ఉన్నందుకుగాను ఆ మహిళను రాళ్లతో కొట్టి చంపాలని తాజాగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆమె ప్రియుడికి ఇంకా పెళ్లి కాకపోవడంతో అతడికి కొరడా దెబ్బల శిక్షను విధించింది. అయితే ఈ కేసు విషయమై పైకోర్టులో అప్పీలు చేయనున్నట్టు రియాద్ లోని లంక ఎంబసీ అధికారులు తెలిపారు. మహిళకు ప్రాణభిక్ష కోసం దౌత్య మార్గాల ద్వారా కూడా ప్రయత్నం చేస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News