: నాన్ సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధర పెంపు


దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజీల్ ధరలు స్వల్పంగా తగ్గిన రెండోరోజే నాన్ సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. 14.2 కిలోల బరువుండే ఒక్కో సిలిండర్ పై రూ.61.50 వంతున పెంచారు. ఒక కనెక్షన్ కు ఏడాదికి 12 సిలిండర్లను మాత్రమే సబ్సిడిపై ఇస్తున్నారు. ఆ కోటా దాటాక ఇచ్చేవే నాన్ సబ్సిడీ సిలిండర్లు. వాటి ధర మాత్రమే ఇప్పుడు పెరిగింది. ఇదే క్రమంలో విమాన ఇంధన ధరలు మాత్రం 1.2 శాతం చొప్పున స్వల్పంగా తగ్గాయి.

  • Loading...

More Telugu News