: నేపాల్ లో భారత టీవీ ఛానళ్ల ప్రసారాల నిలిపివేత
భారతదేశంపై నేపాల్ లో తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. తమ దేశంలోకి సరకులు రాకుండా అనధికారికంగా భారత్ అడ్డుకుంటోందంటూ నేపాలీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో నేపాలీ కేబుల్ టీవీ ఆపరేటర్లు భారత టీవీ ఛానళ్ల ప్రసారాలను నిరవధికంగా నిలిపివేశారు. నేపాల్ కొత్త రాజ్యాంగంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ 'జాయింట్ మాదేశీ ఫ్రంట్' భారతదేశం-నేపాల్ సరిహద్దుల్లో రవాణాను స్తంభింపజేసింది. ఈ నేపథ్యంలో, సరకుతో వెళుతున్న వందలాది లారీలు సరిహద్దుల్లో నిలిచిపోయాయి. భారత్ పై వ్యతిరేకత పెరుగుతుండటంపై నేపాల్ లో భారత రాయబారి రంజిత్ రే స్పందించారు. దానిని ప్రోత్సహించడం ఇరు దేశాలకు ప్రమాదకరమేనని పేర్కొన్నారు.