: వీసా నిబంధనలను కఠినతరం చేసిన అమెరికా... ప్యారిస్ పై ‘ఉగ్ర’దాడే కారణం
ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ పై ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు జరిపిన మెరుపు దాడి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. అగ్రరాజ్యం అమెరికా కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. ప్యారిస్ దాడి తర్వాత ఓ ఆకతాయి అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లోకి ఎంటరయ్యాడన్న కారణంగా అధ్యక్షుడు బరాక్ ఒబామాను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించడమే ఇందుకు నిదర్శనం. అమెరికాపైనా విరుచుకుపడతామని ఇప్పటికే ఐఎస్ ముష్కరులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తమ భూభాగంలోకి ఐఎస్ ఉగ్రవాదులు చొరబడకుండా ఉండేందుకు అమెరికా పలు కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా తాను జారీ చేస్తున్న వీసాలకు సంబంధించిన నిబంధనలను మరింత కఠినతరం చేసింది. దేశంలోకి విదేశీయులు సులభంగా ప్రవేశించే మార్గాలపై నిఘా పెంచిన అమెరికా, వీసా జారీని మరింత కఠినతరం చేయనుంది. ప్రధానంగా ట్రావెల్ వీసాలపై నిఘా పెంచనుంది.