: మెదక్ జిల్లాలో చిరుత బీభత్సం... ముగ్గురిపై దాడి, మహిళ పరిస్థితి విషమం
మెదక్ జిల్లాలో నేటి ఉదయం ఓ చిరుత పులి బీభత్సం సృష్టించింది. అటవీ ప్రాంతానికి సమీపంలోని జనావాసాల్లోకి వచ్చిన చిరుత పులి కంటికి కనిపించిన ముగ్గురు వ్యక్తులపై పంజా విసిరింది. చిరుత దాడిలో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలు కాగా, వారిలో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. జిల్లాలోని కొల్చారం మండలం చుక్కాపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. చిరుత దాడికి గురైన ముగ్గురు వ్యక్తులు కూడా ఒకే కుటుంబానికి చెందినవారుగా గుర్తించారు. చిరుత దాడితో బెంబేలెత్తిపోయిన గ్రామస్తులు అది అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత గాయపడ్డ వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.