: అంతా ఊహించిందే... వడ్డీ రేట్లలో మార్పుల్లేవ్!
అంతా ఊహించిందే నిజమైంది. ద్రవ్య పరపతి విధాన సమీక్షలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వడ్డీరేట్లలో ఏలాంటి మార్పులు చేయలేదు. దేశీయ ఉత్పత్తి రంగం ఉరకలెత్తుతున్న నేపథ్యంలో గడచిన త్రైమాసికంలో జీడీపీ అంచనాలను మించి 7.4 శాతంగా నమోదైన విషయం తెలిసిందే. అంతేకాక ప్రస్తుతమున్న పరిస్థితుల్లో వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు కూడా అవసరం లేదన్న భావన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో నేటి ఉదయం ద్రవ్య పరపతి విధాన సమీక్షలో భాగంగా ఆర్బీఐ గవర్నర్ రఘురామరాజన్ సంచలన నిర్ణయాలేమీ తీసుకోలేదు. కీలక వడ్డీ రేట్లు, రెపో రేటును 6.75 శాతం, రివర్స్ రెపో రేటు, నగదు నిల్వల నిష్పత్తి 4 శాతాన్ని యథాతథంగా కొనసాగించనున్నట్లు ఆయన ప్రకటించారు.