: అద్వానీ సతీమణికి తీవ్ర అనారోగ్యం... ఎయిమ్స్ లో చేరిక
బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ సతీమణి కమలా అద్వానీ నేటి ఉదయం తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆమెను హుటాహుటిన ఢిల్లీలోని అఖిల భారతీయ వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) ఆసుపత్రికి తరలించారు. ఏ తరహా అనారోగ్యానికి ఆమె గురయ్యారన్న వివరాలు వెల్లడికాలేదు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. రాజకీయాల్లో అద్వానీ సుదీర్ఘకాలంగా కీలక భూమిక పోషించినా ఏనాడు కమలా అద్వానీ బయటకు రాలేదు.