: గోవా బీచుల్లో టెన్నిస్ స్టార్... బాలీవుడ్ హీరోయిన్ తో కలిసి ఎంజాయ్
ఈ కేలండర్ ఇయర్ లో ఏకంగా పది డబుల్స్ టైటిళ్లు సాధించి సత్తా చాటిన హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా... ఇక ఈ ఏడాది సీజన్ ముగిసినట్లేనని ప్రకటించింది. గెలుపుతో సీజన్ ను ముగించిన సానియా, స్వల్ప విరామాన్ని సరదాగా ఎంజాయ్ చేస్తోంది. వింటర్ సీజన్ ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో ఇటీవల గోవా వెళ్లిన ఈ టెన్నిస్ బ్యూటీ, బాలీవుడ్ సుందరాంగి పరిణీతి చోప్రాతో కలిసి చిన్నపాటి టూర్ ను ఆస్వాదించింది. గోవా బీచుల్లో వీరిద్దరూ సరదాగా చక్కర్లు కొట్టడంతో పాటు అక్కడి నోరూరించే సీఫుడ్ రుచులను ఇష్టంగా ఆరగించేశారు. ఈ సందర్భంగా వారిద్దరూ కలిసి తీసుకున్న ఫొటోలను పరిణీతి చోప్రా ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, టూర్ ఆసాంతం భలేగా సాగిందంటూ సానియా స్పందించింది.